GDWL: జోగుళాంబ గద్వాల జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ ఘనవిజయం సాధించిన సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి ఎస్. రవికుమార్ గారు మాట్లాడుతూ.. ఈ విజయం వెనుక పోలీస్ శాఖ, కోర్టు లైజన్ ఆఫీసర్లు మరియు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (APPs) సమన్వయం, పటిష్ట ప్రణాళిక ఉన్నాయని అభినందించారు.