SRD: పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో సర్వే నంబర్ 62లోని 6 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ జగన్ ఆరోపించారు. రైతులకు ఎంతో ఉపయోగపడే నక్ష బాటను సైతం కబ్జాదారులు ఆక్రమించారన్నారు. ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక MROకు వారు వినతిపత్రం అందజేశారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.