MDK: తూప్రాన్ పట్టణ పశువుల సంత, తై బజార్ వేలం ఏప్రిల్ ఒకటికి వాయిదా వేసినట్లు కమిషనర్ గణేష్ రెడ్డి తెలిపారు. ఈనెల 18న, 25న, 30న వేలం పాటల కోసం టెండర్ల ఆహ్వానించినప్పటికీ ఒక్కరే రావడంతో వాయిదా వేసినట్లు వివరించారు. ఇవాళ సైతం వేలం పాటలో ఒక్కరే డీడీ చెల్లింపు చేయడంతో దీన్ని మళ్లీ ఏప్రిల్ ఒకటికి వాయిదా వేసినట్లు కమిషనర్ వివరించారు.