NZB :కమ్మర్పల్లిలో జిల్లా సివిల్ సప్లై అధికారులు సోమవారం పలు హోటల్స్పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో అక్రమంగా నిల్వ ఉన్న 11 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసి, 7 గురిపై కేసులు నమోదు చేసినట్లు డిప్యూటీ తహసీల్దార్లు శ్రీనివాస్, వినోద్, ప్రవీణ్ తెలిపారు. పోలీస్ సిబ్బంది వాల్మీకి గౌడ్, జీపిఓస్ శ్రీకాంత్, గంగాధర్, అజయ్, సాయిరాం పాల్గొన్నారు.