NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసిగండిలో ప్రసిద్ధి చెందిన మైసమ్మ దేవాలయ హుండీ ఆదాయం రూ. 9,80,780 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి స్నేహలత తెలిపారు. సోమవారం ఆలయ ఆవరణలో కట్టుదిట్టమైన భద్రత మధ్య గత 60 రోజుల హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రణీత్, ఆలయ ఫౌండర్ ట్రస్టీ శిరోలి, ఎస్సై వరప్రసాద్ పాల్గొన్నారు.