RR: చేవెళ్ల జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పాటి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి బృంగి శ్రీనివాసులు, సీనియర్ సివిల్ న్యాయమూర్తి దశరథ రామయ్య, జూనియర్ సివిల్ న్యాయమూర్తి విజయ్ కుమార్ ఉపాధ్యాయ పాల్గొన్నారు.