KNR: జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు దళితుల మనోభావాలను దెబ్బతీశాయని పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆరోపించారు. కౌశిక్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యా దు చేశారు.