PLD: లక్షలాది పేదల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం నేడు సాకారం చేసిందని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. సోమవారం పట్టణ శివార్లలోని 52 ఎకరాల టిడ్కో గృహ సముదాయంలో ఫేజ్-2 కింద నిర్మించిన 1008 ఇళ్లలో కొన్నింటిని లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి, వారితో గృహప్రవేశాలు నిర్వహించారు.