KMM: జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి 27 వరకు జరగనున్న ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 8 కేంద్రాల్లో మొత్తం 3,349 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తుతో పాటు విద్యార్థుల కోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.