AP: జగన్ హయాంలో ఇచ్చిన టిడ్కో ఇళ్లకు రంగువేసి తమ ఘనతగా కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. చివరకు టిడ్కో ఇళ్లపై కూడా చంద్రబాబు సర్కార్ క్రెడిట్ చోరీ చేస్తుందని ధ్వజమెత్తారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, వాస్తవాలను గుర్తించాలని హితువు పలికారు.