CTR: డిజిటల్ అరెస్టు మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుషార్ సోమవారం సూచించారు. మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్, మెసేజ్, వీడియో కాల్ ద్వారా మోసగించేందుకు ప్రయత్నిస్తారని ఆయన వివరించారు. ఎటువంటి దర్యాప్తు సంస్థలు వీడియో కాల్ ద్వారా ఎవరిని అరెస్టు చేయవని స్పష్టం చేశారు. వారు నగదు డిమాండ్ చేస్తే చెల్లించరాదని సూచించారు.