విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో కార్గో హ్యాండ్లింగ్ సాధించింది. మార్చి 28 నాటికి 90.29 మిలియన్ టన్నుల సరుకును నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. రాక్ ఫాస్ఫేట్, స్టీల్, గ్రానైట్, ఆయిల్ వంటి సరుకుల ఎగుమతి, దిగుమతులు అధికంగా జరిగాయి. అధికారులు, సిబ్బంది కృషితో ఈ ఘనత సాధ్యమైందని పోర్టు యాజమాన్యం పేర్కొంది.