AP: డిసెంబర్‌లోపు మరో 4.50 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రూ.174 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామన్నారు. అర్బన్ కింద కేంద్రం ఇచ్చిన డబ్బులు దుర్వినియోగం చేశారని, గత ప్రభుత్వం రూ.816 కోట్లు అప్పు పెట్టిందన్నారు. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్లు కట్టేందుకు వైసీపీ ప్రభుత్వం యత్నించిందన్నారు. పేదలు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి కల్పించిందన్నారు.