KRNL: రంగాపురం గ్రామానికి సంబంధించిన శాంతి భద్రతల సమస్య నేపథ్యంలో సి.బెలగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 17 మందిని శుక్రవారం కర్నూలు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎదుట బైండోవర్ చేశారు. గ్రామంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకు, శాంతి, సామరస్య వాతావరణం కొనసాగించేందుకు ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్సై వేణుగోపాల్ రాజు తెలిపారు.