AP: మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు అనిత, జనార్దన్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాదం జరిగిన తీరును, అలాగే.. బస్సు డ్రైవర్ను విచారిస్తే స్టీరింగ్ స్ట్రక్ అయినట్లు చెప్పారని సీఎంకు అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు వైద్యంతో పాటు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని చంద్రబాబు ఆదేశించారు.