AP: మార్కాపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై పీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘బస్సు మంటల్లో చిక్కుకుని 13 మంది సజీవదహనం కావడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే రూ.50 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించాలి. ప్రమాద కారణాలపై ఉన్నతస్థాయి కమిటీ వేసి విచారణ చేపట్టాలి’ అని డిమాండ్ చేశారు.