ADB: రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో జిల్లాలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 100 మంది ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లకు పరీక్షలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని డీఎస్పీ జీవన్ రెడ్డి సూచించారు. యూనిఫాం ధరించి ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.