విశాఖకు చెందిన యూ. చిట్టిబాబు న్యాయ విభాగంలో డాక్టరేట్ అందుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భాగంగా బుధవారం వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ చేతుల మీదుగా ఆయన పట్టా స్వీకరించారు. ‘లేబర్ కోడ్-2020’ అంశంపై ఆచార్య డి. సూర్య ప్రకాశరావు పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గానూ ఈ పీహెచ్డీ లభించిందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందించారు.