ASF: అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న DYFI జిల్లా అధ్యక్షుడు టికానంద్ను తిర్యాణి పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. ఆయన మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాసం వెంటనే ప్రారంభించి, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు.