VKB: తాండూరు పట్టణంలోని ఫ్లైఓవర్‌పై ఆదివారం మధ్యాహ్నం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సుమారు అరగంట పాటు వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో ప్రయాణికులు నరకయాతన పడ్డారు. ఇదే సమయంలో అత్యవసర చికిత్స కోసం రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. సైరన్ వేసినా దారి ఇచ్చే అవకాశం లేక వాహనాల మధ్యే అంబులెన్స్ ఉండిపోయింది.