AP: కర్నూలు జిల్లాలో నిన్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి. కృష్ణ మోహన్, జస్టిస్ కె. శ్రీనివాస రెడ్డి, జస్టిస్ ఎ. హరిహరనాథ శర్మ పర్యటించారు. ఈ సందర్భంగా నందికొట్కూరులో నూతనంగా మంజూరైన అదనపు కోర్టు భవనాలను వారు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కొత్త కోర్టులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.