MDK: మనోహరాబాద్ మండలం కూచారం కేజీబీవీ విద్యాలయాన్ని సర్వ శిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాడ్యులర్ కిచెన్‌ను పరిశీలించి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ గౌతమి, ఎంఈవో వెంకటస్వామి, ఈఈ మధుసూదన్ పాల్గొన్నారు.