ADB: ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్ ఆదివారం ఉట్నూర్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉట్నూరు మండలం కుమ్మరితండా గ్రామంలో కుమ్మరి కుండలు తయారు చేయు పరికరాలు పంపిణీ చేస్తారు. ఉదయం 11: 30 ని.లకు ఉట్నూరు మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో ప్రధానోపాధ్యాయుడు కనక రామారావు పదవి విరమణ కార్యక్రమానికి హాజరవుతారు.