ASF: పెంచికలపేట్ మండలం కొండపల్లిలో దశాబ్దాల క్రితం నిర్మించిన పురాతన భావి శనివారం అకస్మాత్తుగా కుంగిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న సర్పంచ్ రుక్మాబాయి బావిని పరిశీలించారు. మంచినీటి బావి కుంగిపోవడంతో నీటి కష్టాలు తప్పవని స్థానికులు తెలిపారు. స్పందించిన ఆమె త్వరలోనే బావికి అవసరమైన మరమ్మతులు చేపట్టి పునరుద్ధరిస్తామన్నారు.