BDK: భద్రాచలం ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న విక్రాంత్ కుమార్ సింగ్ బదిలీ అయ్యారు. ఆయనను మెదక్ జిల్లా అదనపు ఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 బ్యాచ్‌కు చెందిన విక్రాంత్ కుమార్, 2025లో భద్రాచలం ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం మెదక్ అదనపు ఎస్పీగా ఉన్న ఎస్. మహేందర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు.