ELR: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన దరఖాస్తుల స్థితిగతులపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం అర్జీదారులకు నేరుగా ఫోన్ చేసి ఆరా తీశారు. సమస్యలు పరిష్కారమయ్యాయని బాధితులు కలెక్టర్కు వివరించారు. దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.