VZM: జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శనివారం కలక్టరేట్లో పైడితల్లమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనుల పురోగతిపై అదికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణం విస్తరణ, క్యూలైన్ వ్యవస్థ మెరుగుదల, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల ఏర్పాటు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఉత్తరాయణ కాలంలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.