VSP: చందనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్టు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. మొత్తం 2,800 మంది సిబ్బందిని రంగంలోకి దించి, కొండపై , దిగువ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు తమ వాహనాలను కొండ దిగువనే పార్క్ చేసి, దేవస్థానం బస్సుల ద్వారానే పైకి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.