PDPL: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 20 నుంచి 26 వరకు ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో సంక్షేమ వారం అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ఆయన జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో VC నిర్వహించారు. విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం వంటి పోటీలు, పేరెంట్స్‌తో సమావేశం నిర్వహించాలని సూచించారు.