KMM: బోనకల్ మండలంలో కార్తికేయ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో శనివారం మృతి చెందాడు. మృతదేహాన్ని గమనించిన నానమ్మ కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గొర్రెల కాపరిగా పనిచేస్తున్న అతను రాత్రి స్నేహితులతో వెళ్లి వచ్చిన తర్వాత అద్దె షెడ్డులో విగతజీవిగా పడి ఉన్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.