MBNR: నవాబ్‌పేట మండలం రుద్రారంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డి. జానకి ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా 99 రోజుల పాటు ఈ ప్రత్యేక అవగాహన ప్రచారం నిర్వహించనున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా క్రియేటివ్ వీడియోలు రూపొందించిన వారికి రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని ఎస్పీ ఈ సందర్భంగా ప్రకటించారు.