PDPL: పంట పొలాల్లో మొక్కజొన్న, వరి కోత అనంతరం మిగిలిన కొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా అగ్ని ప్రమాదాలకు దారి తీస్తున్నాయని కాల్వ శ్రీరాంపూర్ SI వెంకటేష్ అన్నారు. వ్యవసాయ పనుల్లో నిప్పు అంటించి ప్రమాదాలకు తావు ఇవ్వొద్దన్నారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు రైతులు కొయ్యలను కాల్చకుండా ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలన్నారు.