ADB: ప్రమాదావశత్తు పొలంలో మంటలు చెలరేగి 3 ఎకరాల జొన్న పంట దగ్ధమైంది. ఈ ఘటన తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు మొరుగు ప్రకాష్ మూడు ఎకరాల్లో జొన్న పంట వేశాడు. శుక్రవారం ఒక్కసారిగా పొలంలో మంటలు చెలరేగాయి. మంటలు అర్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోవడంతో అప్పటికే పంట దగ్ధమైందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వేడుకున్నారు.