SRD: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుంచి 18 వరకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఎస్పీ కార్యాలయం నుంచి నిర్వహించిన VCలో ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో సర్పంచ్లు, యువకులతో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు.