NZB: ఆర్మూర్ మగ్గిడి పాఠశాల విద్యార్థినులు సుంకరి ప్రతిప, శార్తి రిషి ప్రియ అండర్-17 జాతీయస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. గత డిసెంబర్లో ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించడంలో వీరు కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు గోవాలోని పానాజీలో జరిగే జాతీయ పోటీల్లో వీరు తెలంగాణ జట్టు తరపున పాల్గొంటారు.