NDL: నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ ‘ప్రజా సమస్యల పరిష్కార’ వేదికగా ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించి వాటిపై సంబంధిత అధికారులతో చర్చించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు న్యాయం చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.