ADB: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేరిందని DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని ఒకటవ వార్డులో శుక్రవారం నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమంలో ఆమె పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా గృహ యజమానికి నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.