ప్రకాశం: టంగుటూరులో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జడ్పీహెచ్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిమాపక ఇంఛార్జ్ వెంకటేశ్వర్లు ప్రమాద సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను విద్యార్థులకు తెలిపారు. ఇంట్లో గ్యాస్ ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మాక్ డ్రిల్ నిర్వహించారు.