ASF: తిర్యాణి మండలం గిన్నెధరి ఆశ్రమ పాఠశాలలో TSTWTU ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షులు పూర్కా ఉద్దవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 51% ఫిట్మెంట్ ఇచ్చి PRC ప్రకటించాలన్నారు. పాత పెన్షన్ విధానం ప్రకటించి, CRT ఉపాధ్యాయులకు మినిమమ్ టైం స్కేల్ చేయాలని డిమాండ్ చేశారు.