BHNG: చౌటుప్పల్ పట్టణంలో పద్మశాలి మహాజన సంఘ అధ్యక్షుడు బడుగు యాదగిరి ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం బడుగు యాదగిరి నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తరువాత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.