WGL: వర్ధన్నపేట పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మంగళవారం అగ్నిమాపక సిబ్బంది సేవలందిస్తూ మరణించిన తోటి సిబ్బందికి నివాళులు అర్పించారు. అనంతరం వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈనెల 14 నుంచి 20 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఫైర్ ఆఫీసర్ భద్రయ్య తెలిపారు. వేసవిలో అగ్నిప్రమాదాలు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు.