కృష్ణా: మోపిదేవిలోని NH-216 రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు గుర్తించిన బ్లాక్ బ్రౌన్ స్పాట్స్ వద్ద ఎస్సై పీ.గౌతమ్ కుమార్ బారికేడ్లు, డ్రమ్ములను ఈరోజు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా వాహనదారులు వేగ నియంత్రణ పాటిస్తూ, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. రాత్రి సమయంలో హెడ్ లైట్లు సరిగా ఉపయోగించుకోవాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని చెప్పారు.