NTR: పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సబ్ ఇన్స్పెక్టర్ అర్జున్ ఆధ్వర్యంలో రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, అనుమానిత వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. సమాజంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా సహించేది లేదని స్పష్టం చేశారు. పాత పద్ధతులు మార్చుకుని, సాధారణ పౌరులుగా జీవించాలని సూచించారు.