WNP: ఉపాధి కూలీలకు ప్రతి 15 రోజులకు ఒకసారి కూలి డబ్బులు చెల్లించాలని, ఫిబ్రవరిలో 6వ తేదీ నుంచి ఇప్పటివరకు డబ్బులు ఖాతాలో జమ కాలేదన్నారు. 2 నెలలుగా డబ్బులు రాకపోవడంతో కొందరు పనికి వెళ్లడం మానేశారు. చట్ట ప్రకారం 15 రోజులుగా డబ్బులు చెల్లించని పక్షంలో రోజువారీగా పరిహారం అందించాలి. వేతనం వెంటనే చెల్లిస్తే కూలీల సంఖ్య పెరిగి పనుల త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉందని కూలీలు తెలిపారు.