SDPT: బెజ్జంకిలో 2005-06 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమ్మేళనంలో బాల్య స్మృతులను గుర్తుచేసుకుంటూ ఆనందం పంచుకున్నారు. ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. గురువులను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. స్నేహబంధం ఎప్పటికీ నిలవాలని ఆకాంక్షించారు.