రాజస్థాన్ రాయల్స్‌పై KKR 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. RRను 155 పరుగులకే కట్టడి చేసిన KKR, ఆ లక్ష్యాన్ని మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అజేయ హాఫ్ సెంచరీతో మెరిసిన రింకూ సింగ్ (53*), అనుకుల్ (29*)తో కలిసి KKRకు ఈ సీజన్లో తొలి విజయాన్ని అందించాడు. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రింకూ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వదిలేసిన RR, భారీ మూల్యం చెల్లించుకుంది.