NZB: వర్ని మండలం జాకోరాలో ఇవాళ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. నిన్న మత్తడి పోచమ్మ పండగ సందర్భంగా గ్రామంలో బోనాల ఊరేగింపు నిర్వహించగా ఇవాళ కుస్తీ పోటీలను నిర్వహించారు. పోటీల్లో గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి మల్ల యోధులు పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు.