NGKL: పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో రైతు సంఘం జిల్లా మూడో మహాసభలు ఆదివారం ఎంతో ఘనంగా నిర్వహించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిలుక బాల్ రెడ్డి ఆల్ ఇండియా కిసాన్ సభ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ హాజరై మాట్లాడుతూ.. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంఘం రాజీలేని పోరాటాలు చేసిందని గుర్తు చేశారు.