WNP: ఉమ్మడి గోపాలపేట మండలంలో ఫిల్టర్ ఇసుక దందాకు అడ్డు కట్టపడేలా కనిపించడం లేదు. ఎన్నిసార్లు ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్న రిలీజ్ అయిన వెంటనే అదే తంతును ఇసుక దొంగలు కొనసాగిస్తున్నారని ఎస్సై శశిధర్ తెలిపారు. ఇసుక ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారో పరిశీలించి, అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదన్నారు.