HNK: ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామ సభ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపితే ప్రభుత్వ పథకాలపై పరిమితులు విధిస్తామని సర్పంచ్ గుంటిపల్లి రేణుక గురువారం తెలిపారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఉచిత యూనిఫాంలు, నోట్ బుక్కులు, షూలు, టై, బెల్ట్‌తో పాటు నాణ్యమైన బోధన అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.